పూసపాటి ఉమామహేశ్వరావు గ్యాంగ్ మా స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారుసిఐని క

Published: Friday July 22, 2022
మధిర జులై 21 ప్రజా పాలన ప్రతినిధి మధిర పట్టణంలో నడిబొడ్డున ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పూసపాటి ఉమామహేశ్వరరావు గ్యాంగ్ అక్రమ లీలలు రోజురోజుకీ బయట పడుతున్నాయి. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో అరెస్ట్ అయిన పూసపాటి ఉమామహేశ్వరరావు బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు పూసపాటి ఉమామహేశ్వర రావు బాధితులు ఎవరైనా ఉంటే తనను సంప్రదించవచ్చని ప్రకటన ఇవ్వటంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం పూసపాటి ఉమామహేశ్వరరావు గ్యాంగ్ తమ స్థలాన్ని ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మధిర బంజారా కాలనీకి చెందిన బాధితులు మలిశెట్టి కోటేశ్వరమ్మ, పద్మ, తూము సుబ్బమ్మ  మధిర సీఐ మురళిని కలిసి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన కథనం తాము ఐదుగురం అక్క చెల్లెళ్ళమని, మా అందరికీ వివాహాలై వెళ్ళిపోయామని వారు తెలిపారు.వాళ్ళు అమ్మ ఈరిశెట్టి లక్ష్మీబాయి పేరుతో మధిర బంజారా కాలనీలో ఐదు సెంట్లు ఇళ్ల స్థలం ఉందన్నారు. దానిని సజ్జ సహదేవరావు అనే వ్యక్తి ద్వారా తప్పుడు దృపత్రాలను సృష్టించి పూసపాటి ఉమామహేశ్వరరావు గ్యాంగ్ అక్రమ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వారు ఆరోపించారు. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా తాము సామాన్యులు కావడంతో ఆనాటి పోలీసులు పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై విచారణ చేసి న్యాయం చేయాలని సిఐని వారు వేడుకున్నారు. ఇదిలా ఉండగా విజయవాడ రోడ్ లో డొంకన ఆక్రమించుకొని బిల్డింగ్ను నిర్మించుకున్నారని ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు ధ్రువీకరించి జిల్లా అధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం. అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద అమరయ్య అనే వ్యక్తికి చెందిన భూమిని సైతం అక్రమంగా ఆక్రమించుకున్నారని దీనిపైకూడా బాధితులు ఫిర్యాదు చేసినందుకు సిద్ధమైనట్లు తెలిసింది.విచారణ చేస్తున్నాం. సీఐ మురళిమధిర బంజారా కాలనీకి చెందిన ముగ్గురు మహిళలు తమ స్థలాన్ని పూసపాటి ఉమామహేశ్వర రావుతో పాటు మరో ఇద్దరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఫిర్యాదు ఇచ్చారని దీనిపై విచారణ చేస్తున్నట్లు సిఐ మురళి చెప్పారు.