శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహారుద్రాభిషేకం

Published: Tuesday August 23, 2022
ఆలయధర్మకర్త ఎస్.ఆత్మలింగం
వికారాబాద్ బ్యూరో 22 ఆగస్టు ప్రజాపాలన : ఆధ్యాత్మిక చింతనతో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్తలు ఎస్.ఆత్మలింగం, ఎస్.మల్లికార్జున్ ల ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం, భవాని సమేత బుగ్గ రామలింగేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమహోత్సవాన్ని అంగరంగవైభవంగా ఘనంగా నిర్వహించారు. ఉదయము ఆరు గంటలకు ఆలయ ప్రాంగణంలో మహా రుద్రాభిషేకాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకాంత్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహింపబడిన గణపతి పూజ, నమ్మకం చమకము శ్రీ సూక్తం వంటి వేదమంత్రోచ్ఛారణలు ఆలయ ప్రాంగణమంతా భక్తి భావం ప్రతిధ్వనించింది. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల భక్తులు వికారాబాద్ ప్రాంత భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని మనసారా తిలకించారు. శ్రావణమాసంలో జరిగే మహా రుద్రాభిషేకం కళ్యాణ మహోత్సవాలను తిలకించి తరించారు. మహా హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ ధర్మకర్తలు ఏర్పాటుచేసిన అన్నదానం కార్యక్రమం కొనసాగించారు. 
 తమ మొక్కలు చెల్లించుకున్నారు.