భృంగి ఇంటర్నేషనల్ స్కూల్లో మానవత్వం మరిచిన కీచక టీచర్

Published: Saturday February 25, 2023

వికారాబాద్ బ్యూరో 24 ఫిబ్రవరి ప్రజాపాలన : వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి కూత వేటు దూరంలో భృంగి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. శైలజ అనే ఒక టీచర్ విద్యార్థులపై విచక్షణ రహితంగా మానవత్వం లేకుండా, క్రూరంగా, తీవ్రంగా కొట్టిన సంఘటన శుక్రవారం భృంగి ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగింది. నాలుగవ తరగతి చదువుతున్న కారుణ్య, ప్రియాహనీ అనే ఇద్దరు విద్యార్థులపై టీచర్ కీచకంగా వ్యవహరించింది. చిన్న పిల్లలు అని చూడకుండా పోలీసులు నేరం చేసిన నిందితుడి నుండి నిజం రాబట్టేందుకు థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగిస్తారో ఆ విధంగా ఈ కీచక టీచర్ ఇద్దరు విద్యార్థులను తీవ్రంగా  కొట్టింది. విద్యార్థులకు తీవ్ర  గాయాలయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులు తీన్మార్ మల్లన్న టీంను సంప్రదించి విషయం తెలుపారు. స్కూల్ విద్యార్థులతో మాట్లాడి 4వ తరగతి విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి శైలజ టీచర్ ఎందుకు కొట్టిందని ఆరా తీశారు. గతంలో ఇలా కొట్టిందా అని ఆరా తీయగా విద్యార్థులు, నిర్ఘాంత పోయే సమాధానం చెప్పడంతో తీన్మార్ మల్లన్న జిల్లా అధ్యక్షులు ఘణపురం శ్రీనివాస్ స్కూల్ డైరెక్టర్ కుమారస్వామి పై ఫైర్  అయ్యారు. 20 మంది విద్యార్థులను విచక్షణ రహితంగా కొడుతున్న, శైలజ అనే కిచక ఉపాధ్యాయురాలిని విద్యార్థులను నిత్యం ఏదో ఒక కారణంతో కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రక్తం వచ్చేలా కొడుతుందని 20 మంది విద్యార్థులు తీన్మార్ మల్లన్న టీం కు తెలిపారు. గతంలో కూడా చాలాసార్లు ఇలా జరిగినా కూడా ఆ కీచక టీచర్ పైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ చేసి మాట్లాడి స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాతపూర్వకంగా లెటర్ కూడా డిఈఓ ఆఫీస్ లో ఈ ఘటనకు బాధ్యులైన టీచర్ పైన స్కూల్ విద్యాశాఖ మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం వికారాబాద్ టౌన్ పోలీసులకు తీన్మార్ మల్లన్న తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఘటనకు బాధ్యులైన ఉపాధ్యాయురాలు శైలజ పై భృంగి స్కూల్ యాజమాన్యంపై డైరెక్టర్ కుమారస్వామి పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు గణపురం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, ప్రగతిశీల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గీతా మహేందర్, ఆనంద్ సంతోష్, జావిద్ తదితరులు పాల్గొన్నారు