పేద విద్యార్థులకు స్కాలర్ షిప్పులు పంపిణీ చేసిన మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూం

Published: Wednesday May 11, 2022
మేడిపల్లి, మే 10 (ప్రజాపాలన ప్రతినిధి) : భారతదేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థలో ఒకటేనా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ హబ్సిగూడ షోరూం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని విద్యానగర్, సీతాఫలమండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్న 205 మంది పేద విద్యార్థులకు హబ్సిగూడ మలబార్ స్టోర్ హెడ్ అహ్మద్ సోఫీ స్కాలర్ షిప్ చెక్కులను అందజేశారు. ప్రతిభ ఆధారంగా 205 మందికి పైగా విద్యార్థి ప్రతిభను గుర్తించి రూ 16,18,000 రూపాయల స్కాలర్ షిప్ మొత్తాన్ని  ప్రకటించామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,500 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి 8 వేల నుండి 10వేల వరకు స్కాలర్ షిప్పు లు అందజేస్తామని ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ ప్రకటించింది. మలబార్ గ్రూపు యొక్క నిబద్దతలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలకు దాతృత్వ కార్యక్రమాలకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాభాల్లో 5 శాతం ఈ ప్రాంతంలో ఖర్చు పెడుతుందని అహ్మద్ సోఫీ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ జి సుకన్య, సీతాఫల్మండి ప్రిన్సిపాల్ రామచంద్రం, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మలబార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.