ఉపాధ్యాయుల పై కక్ష పూనడం మానుకుని పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి స్టీరింగ్ కమిటి సభ్యులు

Published: Tuesday June 07, 2022
కరీంనగర్ జూన్ 6 ప్రజాపాలన ప్రతినిధి :
రాష్ట్రంలోని వివిధ విభాగాల పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇచ్చి,గత 7 సంత్సరాలుగా ఉపాధ్యాయులకు మాత్రమే కనీస పదోన్నతులు ఇవ్వకుండా, కక్ష పూనడం ప్రభుత్వానికి తగదని యూపిఎస్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మాడుగుల రాములు,ఎం.రఘు శoకర్ రెడ్డి అన్నారు.  రాష్ట్ర కమిటి పిలుపు మేరకు కరీంనగర్ లోని పదవతరగతి  స్పాట్ కేంద్రం నుంచి కేంద్రం సెంట్ జాన్ హై స్కూల్ ముందు  జరిగిన నిరసన ప్రదర్శన రాష్ట్ర స్టీరింగ్ మాడుగుల రాములు పాల్గోన్నారు. ఎం.రఘుశంకర్ రెడ్డిలు ఈ సందర్బంగా  మాట్లాడుతూ"విద్య రంగ  సంక్షోభం సమస్త సమాజ సంక్షోభానికి కారణమవుతుందని, కావున విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించి  సమాజ సంక్షేమానికి పాటుపడాలని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉపాధ్యాయులకు కనీస బదిలీలు,పదోన్నతులు ఇవ్వకుండా వేదించడం ప్రభుత్వానికి తగదన్నారు. వెంటనే బదిలీల, పదోన్నతుల షెడ్యూలు  ప్రకటించి ప్రభుత్వం చిత్త శుద్దిని నిరుపింతుకోవాలని.లేనిచో, దశల వారి ఉద్యమాల ద్వారా మా కనీస హక్కులు మేము సాదించుకుంటాము" అని హెచ్చరించారు.
ఈ నిరసనలో డి .టి. ఎఫ్ . రాష్ట్ర కార్యదర్శి వి. రాజిరెడ్డి,టి. పి. టి.ఎఫ్ జిల్లా అధ్యక్షులు పోరే డ్డి దామోదర్ రెడ్డి, డి. టి. ఎఫ్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి,ప్రధాన కార్యదర్శి తూం తిరుపతి, టి. పి. టి. ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు  పాతూరి మహేందర్ రెడ్డి, టి. పి. టి. ఎఫ్ సిరిసిల్ల అద్యక్షులు దోర్నాల భూపాల్ రెడ్డి,
ఆర్. చంద్రశేఖర్ రావు,కే. కిషన్ రావు,రామచంద్ర రెడ్డి, రామ్ నాథ్ రెడ్డి,ఎన్.శ్రీనివాస్, రమణా చారి, శశిధర్, జావీద్ , వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు