పంటకల్లాల కోసం దరఖాస్తులు చేసుకోవాలి..

Published: Tuesday November 23, 2021
మండల వ్యవసాయ అధికారి తాజుద్దీన్..
తల్లాడ, నవంబర్ 22 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని రైతులు పంట కల్లాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని తల్లాడ మండల వ్యవసాయ అధికారి ఎండి తాజుద్దీన్ సూచించారు. మంగళవారం ఏవో మాట్లాడుతూ పంటలు ధాన్యాన్ని ఆరబోసుకో వడానికి పంట కల్లాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం సబ్సిడీతో, బిసి, ఓసి రైతులకు 90% సబ్సిడీతో ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. సంబంధిత పత్రాలు గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారులకు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.