చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లపై కెసిఆర్ పోరాడాలి

Published: Tuesday February 14, 2023

జన్నారం, ఫిబ్రవరి 13, ప్రజాపాలన: చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించుటకై ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడాలని సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని సమావేశంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బిసి కులాల పోరాట సమితి కో- కన్వీనర్ మామిడి విజయ్ అన్నారు. ఈ సందర్భంగా నేడు జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం సందర్శించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ తరపున బిసి హక్కులకై పోరాడాలని, అదేవిధంగా కొండగట్టు హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్లు నిధులు తెలిపినందుకు ముఖ్యమంత్రి గారికి బీసీ అన్ని కుల వర్గాల తరపున ధన్యవాదాలు తెలుపుతున్న మన్నారు. దేశానికి స్వసంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ చట్టసభలలో అసెంబ్లీలలో, పార్లమెంటులలో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వలన వందలాది బీసీ కులాల వారు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చట్టసభలలో అడుగుపెట్ట లేక పోతునరన్నారు. గత 75 ఏళ్లుగా పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ బిజెపి పార్టీల స్వార్థ సంకుచిత రాజకీయాల వలన ఇలా జరుగుతుందన్నారు. దేశంలో ప్రతి ఉద్యమం వెనుక అగ్రవర్ణాల అండదండలతోనే కార్మికుల రైతు కూలీల రైతుల ఉద్యమాల వలననే హక్కులు సాధించుకోవడం సమస్యలు పరిష్కరించుకోవడం అనేది జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2001 లో ప్రారంభించి 2014లో సాధించగలిగారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం పటిమ అటువంటిది అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో రాజకీయాలలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించి ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారన్నారు. అన్ని రాష్ట్రాలలో పార్టీని విస్తరించడానికి సభలు సమావేశాలు నిర్వహించ బోతున్నామన్నారు. తెలంగాణ ప్రజల కోసం రైతుబంధు, రైతు బీమా మొదలగు పథకాలను ప్రచారం చేస్తూ భారతదేశ స్థాయిలో ప్రజల మెప్పు పొందడం కష్టమైన పని వీటికి తోడుగా చట్ట సభలైన అసెంబ్లీ పార్లమెంటులలో బీసీ కులాల వారికి రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ ను తీసుకొని ముందుకు వెళితే 60 శాతం బీసీ కులాల జనాభా గల అత్యధిక కులాల వర్గాల వారిని ఆకర్షించి జాతిపితగా అవతరించే అవకాశం అతి సమీపంలో ఉందన్నారు. జాతీయస్థాయిలో బీసీ కులాల వారు చైతన్యవంతులవుతే త్వరలో జాతీయస్థాయిలో మార్పు రాగల  అవకాశాలు ముందుగా ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించుకొని నాయకత్వం వహించడం అయితే బీసీ కులాల రాబోయే ఎన్నికలలో అధికారం పెట్టి ఇచ్చిన అవకాశం లభిస్తుంది అన్నారు. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభలలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలిగి ఉన్నారన్నారు. ప్రస్తుతం ఇదే సమస్యను జాతీయ స్థాయిలో ప్రచారం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పరిష్కార మార్గం గగనం చేయాలని బీసీ కులాల వారు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బీసీ సంఘ పోరాట సమితి నాయకులు కే ఏ నరసింహులు, కాసెట్టి లక్ష్మణ్, కొంతం శంకరయ్య, అల్లం లచ్చన్న, అల్లం సాంబయ్య, శ్రావణ్ ప్రవీణ్ అనుముల శీను ఆకుల నరేష్ వెంబడి సత్యం ఆడేపు లక్ష్మీనారాయణ, శ్రీరాముల గంగాధర్, మామిడి విజయ్, అయిలవేణి నరసయ్య, దండవేణి చంద్రమౌళి, సిరవేణి పెద్దిరాజం, మూల భాస్కర్ గౌడ్, జంగం సంతోష్, తదితరులు పాల్గొన్నారు.