హత్య కేసును చేధించిన మధిర రూరల్ పోలీస్

Published: Thursday September 01, 2022
మధిర రూరల్ ఆగస్టు 30 ప్రజా పాలన ప్రతినిధి మధిర మండలంలోని మాటూరు బస్టాండ్ దగ్గరఈనెల 22 8 22న రాత్రి సుమారు 8:30 గంటల ప్రాంతంలో మాటూరు క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుగొలను గ్రామానికి చెందిన సంగేపు పృద్వి రోడ్డు ప్రమాదం లో చనిపోయినట్లుగా దరఖాస్తు ఇవ్వగా మధిర రూరల్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 107/22 గా ఎఫ్ఐఆర్ నమోదు అయినది . ఏసీపి వైరా సూచనల మేరకు సీఐ మధిర  ఆధ్వర్యంలో ఎస్సై మధిర రూరల్ నరేష్ మరియు అతని సిబ్బంది కేసు విచారణ చేయగా ఇట్టి మరణం రోడ్డు ప్రమాదంలో జరగలేదని పెనుగొలను కు చెందిన మృతుని బావ కుంచం మధు , మధిర కు చెందిన పోకల ప్రవీణ్ , రావూరి అనిల్ అను ముగ్గురు వ్యక్తులు రాడ్ తో కొట్టి చంపినారని రుజువు అయినది . తేదీ 22 8 22 నాడు సాయంత్రం 0600 గంటల సమయం లో మధు ,ప్రవీణ్ ,అనిల్ లు మధిర టౌన్ నందు గల నందిగామ సెంటర్లో కలుసుకొని మదు తన భార్య భర్తల గొడవ విషయంలో బావమరిది పృథ్వి కలగచేసుకుని తన అక్కకు సపోర్ట్ చేయడం వల్ల తన సంసారం నాశనం  అవుతుందని పృథ్వి అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలని ప్రవీణ్ , అనిల్ లను సహాయం అడగగా వారు సరే అన్నారు .అదే రోజు రాత్రి సుమారు 8 గంటల సమయంలో మధు ,ప్రవీణ్ , అనిల్ లు మాటూరు క్రాస్ రోడ్డు వద్ద గల బస్సు షెల్టర్ వద్దకు చేరుకొని ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రవీణ్ ,అనిల్ లు  రాడ్ తో సహా బస్సు షెల్టర్ వెనుక దాచుకొని పృద్వి బస్సు షెల్టర్ వద్దకు రాగానే రాడుతో పృథ్వి తలపై కొట్టినారు.  కింద పడిపోయిన పృథ్విని మధు ప్రవీణ్ అనిల్ లు రాడుతో తల పై కొట్టినారు . పృథ్వీ చనిపోయినాడు అని నిర్ధారించుకున్న తర్వాత ఇట్టి మరణాన్ని సెల్ఫ్ యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చనిపోయిన వ్యక్తి వేసుకు వచ్చిన బైక్ ని  అతని మీదే వేసి అక్కడి నుండి వెళ్ళిపోయినారు .నిన్న రాత్రి సమయంలో ఇట్టి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది .ఇట్టి కేసు ను చేదించిన మధిర సి ఐ మురళి , మధిర రూరల్ ఎస్ ఐ నరేష్ మరియు  పోలీస్ సిబ్బంది నీ ఖమ్మం సి పి  అభినందించారు.