*ప్రజాపాలన షాబాద్:::-- *షాబాద్ మండల కేంద్రంలో ఆశా నోడల్ అధికారికి ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వే

Published: Tuesday December 06, 2022

 ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ స్కూటమి  డబ్బాలు ఆశాలతో మోపించే విధానాన్ని రద్దు చేయాలి స్పెషల్ ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా నిర్వహిస్తున్న సర్వేలకు ఇతర కార్యక్రమాలకు అదనంగా పారితోషకాలు చెల్లించాలి పెండింగ్ బిల్లులు అన్నిటిని వెంటనే చెల్లించాలి ఫిక్స్డ్ వేతనం పదివేల రూపాయలు నిర్ణయం చేయాలి రేపటి నుంచి జరిగే లెప్రసీ సర్వేకు ప్రభుత్వం అదనంగా  చెల్లించాలి అదేవిధంగా జనవరి 18 నుంచి నిర్వహించే కంటి వెలుగు పనికి అదనంగా డబ్బులు చెల్లించాలి జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి డబ్బులు వెంటనే కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు ₹1000 చొప్పున 16 నెలల బకాయిలు డబ్బులు వెంటనే చెల్లించాలి ఆశా కార్యకర్తలకు పని భారం తగ్గించాలి జాబ్ చార్ట్ ను విడుదల చేయాలి 32 రకాల రిజిస్టర్స్ ప్రింట్ చేసి ప్రభుత్వమే సప్లై చేయాలి  తదితర సమస్యలపై ఆశా కార్యకర్తలకు సిఐటియు అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు దేవేందర్ అలీ ఫార్మసిస్ట్ శంకర్ సూపర్వైజర్ సువర్ణ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు*