అక్రమ ముందస్తు అరెస్ట్ లతో మా పోరాటాన్ని ఆపలేరు కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అద్యక్ష

Published: Tuesday January 03, 2023

కోరుట్ల, డిసెంబర్ 31 (ప్రజాపాలన ప్రతినిధి):
ఛలో ప్రగతి భవన్ ముట్టడి కోసం సన్నద్ధం అవుతున్న కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ శ్రేణులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు
ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నియామకాలు చేపట్టడం జరిగిందని,పోలీస్ రిక్రూట్మెంట్ లో ఎస్సై మరియు కానిస్టేబుల్ నియామకాలు సంబంధించి కానిస్టేబుల్ పరీక్షలో తప్పులకు మార్కులను కలపాలని, మరియు దేహాధారుడ్య పరీక్షలలో రన్నింగ్ రేస్ అయిన వెంటనే ఎటువంటి విరామం లేకుండా లాంగ్ జంప్, షాట్ పుట్  పోటీలు పెట్టడం వల్ల అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, ఇలా జరుగుతున్న తప్పులను సరిచేసి
హై కోర్ట్ ఆర్డర్స్ ఇంప్లీమెంట్ చేయాలనీ డిమాండ్లతో నిరసనగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంకు యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చిన సందర్భంగా ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అద్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్దం అవుతున్న యూత్ కాంగ్రెస్ నాయకులను మరియు శ్రేణులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ లో నిర్బంధించరని,ఈ  విధంగా ప్రతి సారి నిరసన కార్యక్రమం జరగకుండా శాంతి యుతముగా పోరాటం చేయకుండా ముందస్తుగా అరెస్ట్ లు చేయిస్తూ, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ మరియు  పోలీసు నియామక అభ్యర్థులకు న్యాయం చేయాలని లేని యెడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఏలేటి మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  అరెస్ట్ అయినా వారిలో కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, కోరుట్ల పట్టణ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు రిజ్వన్ పాషా,కోరుట్ల మండలం యూత్ కాంగ్రెస్ అద్యక్షులు పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మ్యాదరి లక్ష్మణ్, సరికేళ్ళ నరేష్, కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వాసం అజయ్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు ముహమ్మద్ నసీర్ లు మరియు తదితరులు ఉన్నారు.