పశు మిత్రుల కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి ** సిఐటియు జిల్లా అధ్యక్షుడు లోకేష్ **

Published: Tuesday February 07, 2023
అదరపు కలెక్టర్ కు వినతి పత్రం **
 
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 06(ప్రజాపాలన,ప్రతినిధి) : పశు మిత్రుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో పశుమిత్రులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పశు మితుల సమస్యలపై సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పశు మిత్రులు గత 2017 నుండి పనిచేస్తున్నారని, సెల్ఫ్ ద్వారా ట్రైనింగ్ సర్టిఫికెట్స్ ఇచ్చి వేతనాలు నిర్ణయించి ఇవ్వకుండా వైద్య సేవలు చేయాలని ప్రభుత్వం చెప్పడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మూగజీవులకు వైద్య సేవలు అందిస్తున్న పశువు మిత్రులకు ప్రయాణ చార్జీలు అలవెన్స్ లేకుండా వేతనాన్ని నిర్ణయించి ఇవ్వకుండా పశువులకు వైద్యం చేయాలని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా సెల్ఫ్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వైద్య సేవలు అందిస్తున్న పశు మిత్రులకు గుర్తింపు ఇవ్వాలని, కనీస వేతనాలు రూ 26 నిర్ణయించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈనెల 22వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున పశువు మిత్రుల సంఘం ఆధ్వర్యంలో సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో వివిధ మండలాల పశుమిత్రులు పాల్గొన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో పశు మిత్రులు ఇందు, మరువ భాయ్, భారతి, సునీత, శ్రీలత, కమల, భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.