కొలతల తో సంబంధం లేకుండా ఉపాధి కూలి చెల్లించాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం

Published: Wednesday April 27, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి : తాటి పర్తి నందివనపర్తి గ్రామాలలో ఉపాధి కూలీల సమస్యలు తెల్సుకొని మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి.అంజయ్య ఉపాధి హామీ పనీలో కొలతలు రద్దుచేసి ఉపాధి హామీ చట్టంలో నిర్ణయించిన ప్రకారం రోజు కూలి 257 రూపాయలు ఇయ్యాలి. ఉపాధిహామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పుల వలన ఉపాధి కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు వెంటనే వాటిని రద్దుచేసి గతంలో లాగా పద్ధతిలో పనులు కొనసాగించాలి. వాచర్స్ 6 మరియు కూలీలు వారాలనుండి గ్రామాలల్లో పని చేస్తున్న ఇ ప్పటికి డబ్బులు రాక పోవడం దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం కూలీలకు ప్రతి వారం డబ్బులు వేయక పోవడం పనిలో అనేక మార్పులు తేవడం వలన యాచారం మండలంలో ఈ నెలలో 12000 వేల మంది కూలీలు పనికి పోయేవారు ప్రభుత్వం పుణ్యమా 3000 వేల పైన మాత్రమే పనికి పోతున్నారు పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని నీరు కార్చడం కోసం  మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉంది ఉపాధి హామీ చట్టం రక్షణకోసం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలి. వ్యవసాయ కార్మిక సంఘం పోరాట ఫలితంగా పే స్లిప్ లు రిలీజ్ చేసినప్పటకీ అన్నిగ్రామాలకు కూలీలకు వెంటనే చేరాలి. మెడికల్ కిట్లు అందుబాటులో ఉండాలి. పనిముట్లు గడ్డపార తట్ట పార కొడవలి గొడ్డలి ఇయ్యాలి. గడ్డపార మొన వాటర్ బిల్లుల డబ్బులు పెంచాలి. కూలీలకు ప్రతివారం డబ్బులు చెల్లించాలి. తాటిపర్తి గ్రామంలో కారోబార్ అడిషనల్ గా  ఉపాధి హామీ పని చూపిస్తున్నాడు. ఇక్కడ వెంటనే  మేటును ఏర్పాటుచేసి అతని ద్వారా పని కల్పించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట నూనె నిత్యావసర సరుకుల ధరలు పెంచడం మోయలేని భారం ఐంది కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టం ప్రకారం  రోజుకు 600 రూపాయలు ఇవ్వాలి. సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే వీధిల్లో కి తీసుకోవాలి. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి . ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. కూలీల అందరికీ పని కల్పించాలి ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా తాటిపర్తి గ్రామంలో నూతన కమిటీ ఎన్ను కోవడం జరిగింది అధ్యక్షులుగా ch వరమ్మా ప్రధాన కార్యదర్శిగా MD ఖాసీం. సహాయ కార్యదర్శి వై బాలయ్య. కృష్ణ రెడ్డి ఉపాధ్యక్షులు బి పాపయ్య. యాదమ్మ మంగమ్మ బి మాదవి బ్రహ్మచారి ఎం రవి ఎం దీప తదితరులు ఉన్నారు.