ప్రభుత్వ ఆస్పత్రిలో ముమ్మరంగా సాధారణ కాన్పులు

Published: Thursday August 25, 2022

మధిర రూరల్ ఆగస్టు 24 ప్రజాపాలన ప్రతినిధి  ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముమ్మరంగా సాధారణ కాన్పులు చేస్తున్నట్లు దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శశిధర్ మాటూరుపేట వెంకటేష్ పేర్కొన్నారు. జిల్లా  కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఆదేశాల మేరకు ప్రతి గర్భిణీ స్త్రీ సాధ్యమైనంత వరకు ప్రభుత్వ హాస్పిటల్లో సాధారణ కాన్పులు జరిగించాలని  లక్ష్యంతో పని చేస్తున్నట్లు వారు తెలిపారు. బుధవారం మండల పరిధిలోని సిరిపురం గ్రామాల్లో ఉచిత వైద్యం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరారు వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని గృహాల్లో వాడేసిన టైర్లు కొబ్బరి బోండాలు లేకుండా చూసుకోవాలన్నారు .ఈ నెలలో దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు సాధారణ కాన్పులు చేయటం జరిగిందని శశిధర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు చేయించుకునే విధంగా ఆరోగ్య పర్యవేక్షణరాలు గోలి రమాదేవి సూపర్వైజర్లు సుబ్బలక్ష్మి, లంకా కొండయ్య, గోవింద్, కౌసల్య తదితరులు సాధారణ కాన్పుపై అవగాహన కల్పించారని వారు తెలిపారు.