టీ బి, క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు

Published: Thursday March 25, 2021
వలిగొండ ప్రజా పాలన ప్రతినిధి : మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలో బుధవారం టీబీ నిర్మూలన అవగాహన సదస్సు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీ.బి ఓడిపోతుంది భారత్ గెలుస్తుంది, అవగాహనను మించిన వైద్యం లేదని, టీ బీ, క్షయ వ్యాధిపట్ల అవగాహన పెంచుకుని 2025 కల్లా టీ.బి.ని ఓడించి, భారత్ ని గెలిపించి దేశంలో టీ.బి.జాడే లేకుండా నిర్మూలిద్దామని వేములకొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆరోగ్య పర్యవేక్షకుడు నాశబోయిన నరసింహ అన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, బరువు బాగాతగ్గడం, మెడపై వాచినగడ్డలు లేదాగ్రంధులు, మొదలైనవి టీ బి లక్షణాలుగా గుర్తించాలనీ,తెమడపరీక్ష,ఎక్స్ రే ద్వారా టీ.బి.నిర్ధారించవచ్చన్నారు. టీ.బి.రోగి దగ్గినప్పుడు,తుమ్మిన ప్పుడు టీబి క్రీములు సన్నని తుంపర్ల ద్వారా గాలిలోకి వ్యాపించి, ఆరోగ్యవంతులు ఈ గాలి పీల్చినపు డు వారికి ఈవ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. టీబి నిర్ధారణ పరీక్షలు మరియు మందులు అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో పూర్తిగా ఉచితంగా లభిస్తాయన్నారు. వీలైనంత త్వరగా టీ.బి.ని గుర్తించి క్రమంతప్పకుండా డాట్స్ చికిత్సతో పూర్తిగా నయం చేయవచ్చన్నారు. భారత్ లోప్రతి దినం సుమారు ఆరు వేలమందికి పైగా టీబి.బారిన పడుతున్నారని సుమారు 600 మందికి పైగా చనిపోతున్నారనీ, ప్రతి ఐదు నిమిషాలకు ఇద్దరూ టీబికి బలైపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు మంచికంటి జానకి రాములు, ఎ.సాలమ్మ, ఆశా కార్యకర్తలు లక్ష్మి, నమ్రత, లక్ష్మినరసమ్మ గ్రామస్థులు పాల్గొన్నారు.