హరితహారానికి ఊపిరి జీవనాధారం చెట్లు. మొక్కలు నాటిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత. బూర్గంపాడు (

Published: Thursday December 08, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు భద్రాద్రి జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక శాసన సభ్యులు శ్రీ రేగా కాంతారావు* ఆదేశాల మేరకు...గ్రీన్ ఛాలెంజ్ రూపకర్త గౌ: ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్  జన్మదినం సందర్బంగా జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిడెంట్ డాక్టర్ నవీన్, బి ఆర్ ఎస్ పార్టీ బూర్గంపాడు మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అవరణం  నందు మొక్కలు నాటడం జరిగింది...ఈ సందర్భం గా జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతి తల్లిలాంటిదని, చెట్లు ప్రాణికోటికి ప్రాణాదారమని చెప్పారు. పర్యావరణం పరంగా గతంలో జరిగిన నష్టాలను పూరించే దిశగా ఈ తరం యువత సమాజాన్ని పునర్నిర్మించాలని పిలుపునిచ్చారు. మన ఇంటి పరిసరాల్లో, మనకు చేరువలో పచ్చదనాన్ని ఉంచుకోవాలని యువతను కోరారు.ఈ  కార్యక్రమంలో  జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, బూర్గంపాడు మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని, మండల ప్రచార కార్యదర్శి తోకల సతీష్, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరిడెంట్ డాక్టర్ నవీన్, డాక్టరు అనిత, డాక్టర్ శాంతి ప్రియ ,శ్రీవాస్తవ, స్థానిక డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది,రెడ్డిపాలెం జనరల్ సెక్రెటరీ గొడేటి సుధాకర్, భూర్గంపహాడ్ యువజన ప్రధాన కార్యదర్శి శమాకురి సతీష్, మండల విద్యార్ధి విభాగం సభ్యులు బర్ల ప్రవీణ్ కుమార్, ఐలపొంగి ప్రసాద్ ,కోటా సంతోష్, గోళ్ళ రవి, బిళ్ళ కంటి సతీష్ ,మేకా పున్నం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు