కరుణామయుడు ఏసు క్రీస్తు మహాత్యాగానికి గుర్తు మండలంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

Published: Saturday April 08, 2023
బోనకల్ ఏప్రిల్ 7 ప్రజా పాలన ప్రతినిధి:మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయులు పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులులేని త్యాగం ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం.. జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే ఏసు క్రీస్తు శిలువ వేయబడిన రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రజలకోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.శిలువ మీద తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించుమని భగవంతున్ని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు అని పేర్కొన్నారు.గుడ్ ఫ్రైడే’ క్రైస్తవులకు పరమ పవిత్రమైన రోజని అన్నారు. సమస్త మాన‌వాళి ప‌ట్ల ప్రేమ‌, నిస్సాహాయుల ప‌ట్ల జాలి, అవ‌ధులు లేని త్యాగం, సడలని ఓర్పు, శ‌త్రువుల ప‌ట్ల క్షమాగుణం అనే గొప్ప లక్షణాలను కలిగివుండడం కరుణామయుడైన ఏసుక్రీస్తుకే సాధ్యమైందని అన్నారు.ఈ లక్షణాలను ప్రతి వొక్కరూ పుణికి పుచ్చుకోవాల్సిన అవసరం వున్నదన్నారు. మానవజాతికి శాంతి సహనం అహింస సౌభ్రాతృత్వాలను క్రీస్తు తన ఆచరణ ద్వారా సమస్త మానవాళికి సందేశంగా ఇచ్చాడని తెలిపారు.విభేదాలు తారతమ్యాలు లేకుండా మనుషులంతా వొక్కటిగా కలిసి వుండేందుకు ఏసుక్రీస్తు బోధనలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. 
 గుడ్ ఫ్రైడే ను ప్రజలు దైవ ప్రార్థనలతో జరుపుకోవాలనీ, ప్రజల మధ్య శాంతి, సామరస్యం విలసిల్లాలని ఈ సందర్భంగా ఫాదర్, ఆకాంక్షించారు. మండలంలోఅన్ని గ్రామంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రొద్దుటూరు విచారణ గురువులు ఫాదర్ మలమట్టి ఏసురత్నం ఆధ్వర్యంలో లక్ష్మీపురం, తుటికుంట్ల రెడ్డిగూడెం, సీతారాంపురం గ్రామంలో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు.పవిత్ర తపస్సు కాలంలో భాగంగా గత 40రోజుల నుండి పవిత్ర దీక్షలు చేస్తూ, ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు జరుపుకున్న క్రైస్తవులు చివరి రోజు అయిన పవిత్ర శుక్రవారం రోజున ఏసు క్రీస్తు సిలువ శ్రమలను ఆరాధించుకుంటూ గ్రామ వీధులలో సిలువను మోస్తూ, సిలువ మార్గాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీక్షాపరులు, సంఘ పెద్దలు , సంఘస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.