11వ వేతన ఒప్పందం జాప్యానికి నిరసన పాటించండి టి ఎన్ టి యు సి

Published: Friday December 09, 2022
 టి ఎన్ టి యు సి
 
బెల్లంపల్లి డిసెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి:  11వ వేతన ఒప్పందం జాప్యానికి శుక్రవారం ఒకరోజు  నిరసన పాటించాలని టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి టి, మణి రామ్ సింగ్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
గురువారం స్థానిక శాంతి ఖని గని పై ఏర్పాటు చేసిన ద్వార సమావేశంలో కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు,
సంస్కరణల పేరుతో బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తూ, గని కార్మికుల నిజవేతనాల్లో కోతలు విధిస్తున్నారని, పదవ వేతన ఒప్పందంలో 27 శాతం పెరుగుదల నమోదుకాగా, పదకొండవ వేతన ఒప్పందం వచ్చేసరికి 50 శాతం జాతీయ సంఘాలు డిమాండ్ చేయగా మూడు శాతం దగ్గర మొదలైన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా వాయిదాలు  పడుతుండడంతో అసంపూర్తి చర్చలతో కాలం గడుపుతున్నారని అన్నారు.
  బడా కార్పొరేట్ కంపెనీలు బొగ్గు గనులను వేలంలో దక్కించుకొని జేబీసీసీఐలో పెత్తనం చెలాయిస్తున్నారని, జాతీయ బొగ్గు గనులను సైతం శాసిస్తున్నాయని అన్నారు.
 కార్మికుల కనీస వేతనాల పెరుగుదలను పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను  పరిగణలోకి తీసుకుని దానికి అనుగుణంగా పెంచాల్సి ఉండగా, టోకు ధరల తో లెక్క కట్టడంతో నిజ వేతనాలు పడిపోతున్నాయని, క్యాడర్ స్కీం లాంటి సమస్యలు దశాబ్దాల తరబడి పరిష్కారానికి నోచుకోవటం లేదని అన్నారు.
 5 వందల నుండి 15 వందల వరకు పెన్షన్ తీసుకునేవారు ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలో గ్రాట్యూటీ  సీలింగ్ ఎత్తివేసి 20 లక్షలకు పెంచిన కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
 రిటైర్డ్ కార్మికులకు రావలసిన బకాయిలు ఇప్పటికీ వరకు ఇవ్వలేదని, కోల్ ఇండియా లో  అలవెన్స్ లపై  పన్ను  మినహాయింపు లభిస్తుండగా, సింగరేణిలో మాత్రం రిఫండ్ చేయకుండా కార్మికుల శ్రమను దోచుకుంటునారని మండిపడ్డారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు రాయతిలిస్తున్న ప్రభుత్వాలు, కార్మికులకెందుకు ఆదాయం పన్ను రద్దు చేయటం లేదని, వెంటనే కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని, సింగరేణి యజమాన్యాన్ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో
 టి ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి టి, మణి రామ్ సింగ్, ఓ, జీవరత్నం, ఎండి హసన్, హరికిషన్ పాండే, కాసర్ల వెంకటేష్, బొల్లు మల్లయ్య, జి, సదానందం, ఆర్ గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.