సమాజంపై బాధ్యతగా ఉండండి: స్పెషల్ ఆఫీసర్ బాలరాజు

Published: Friday April 30, 2021
మహబూబాబాద్, ఏప్రిల్ 29, ప్రజాపాలన ప్రతినిధి : నెల్లికుదురు మండలం లో గల వివిధ గ్రామాలను స్పెషల్ ఆఫీసర్ బాలరాజు గురువారం రోజు నా కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటి వద్దకు వెళ్లి  హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని బయట తిరగడం వద్దని సమాజంపై బాధ్యతను చూపాలని ఇబ్బంది ఎక్కువగా అయిన వెంటనే నెల్లికుదురు లో ఐసోలేషన్ సెంటర్ ఉపయోగించుకోవచ్చని ఏఎన్ఎం ఆశ వర్కర్ల యొక్క సేవలు మీకు అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు, నిత్యవసర సరుకులు కావాలంటే గ్రామ సిబ్బంది ద్వారా తెప్పించుకోండి అని వారికి ధైర్యాన్ని చెప్పారు ఈ విజిట్ లో భాగంగా చిన్న ముప్పారం పెద్ద తండా గ్రామపంచాయతీ పల్లె ప్రకృతి వనాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, ఎంపీడీవో వేణుగోపాల్, పాల్గొన్నారు