జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర

Published: Friday November 26, 2021
యాదాద్రి భువనగిరి జిల్లా 25 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి : ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఇచ్చిన పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది. రైతులకు తాము పండించిన పంట ఉత్పత్తులను మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చెయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సరియైన సంఖ్యలో ఏర్పాటు చేయలేదన్నారు. దీని మూలంగా ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుందన్నారు. ఆలస్యం చేయడం మూలంగా వరి ధాన్యం కేంద్రాలలో సరియైన సౌకర్యాలు లేకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన వరి ధాన్యం ను ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. కేంద్రం మరియు రాష్ట్రంలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని యాదాద్రి -భువనగిరి జిల్లా భువనగిరి డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని దాన్యం కొనుగోలు చేయకుండా నాటకం ఆడుతున్నారని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ధ్వజ మెత్తారు. రాష్ట్రంలో మహిళా రైతులు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని శ్రమకోర్చి పండించిన పంటను అమ్ముకోడానికి అష్ట కష్టాలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రంగుమారిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని అని కుంటి సాకులు చెప్పి తప్పించుకోకుండా వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయాలని ఈసందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు ఝాన్సీ. అనిత జ్యోతి. అచ్చరాలు. పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ మాజీ ప్లానింగ్ కమిటీ మెంబర్ తంగళ్ళపల్లి రవి. కాల్ రాజు మొదలగువారు పాల్గొన్నారు.