హత్య కేసులను ఛేదించిన పోలీసులు

Published: Friday December 02, 2022
* ప్రియురాలితో అక్రమ సంబంధం అనుమానంతో హత్య
* గంజాయి సరఫరా చేయలేదని మరో హత్య
* రెండు హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న మొహమ్మద్ సల్మాన్
* మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడి
వికారాబాద్ బ్యూరో 01 డిసెంబర్ ప్రజాపాలన : ఇద్దరినీ హత్య చేసి పోలీసుల కళ్ళు కప్పి దర్జాగా  తప్పించుకొని తిరుగుతున్న హంతకున్ని వికారాబాద్ పోలీసులు పట్టుకున్నారని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా  జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ సల్మాన్(24), కళ్యాణ్ బాబు సురేష్ లను హత్య చేశాడని స్పష్టం చేశారు. కళ్యాణ్ బాబు, మహమ్మద్ సల్మాన్ ప్రియురాలితో అక్రమ సంబంధం నేర్పుతున్నాడనే అనుమానంతో శివారెడ్డి పెట్ శివారులో గల బావి దగ్గరికి ఇద్దరు కలిసి వచ్చి గంజాయి, మద్యం సేవించిన తర్వాత కళ్యాణ్ బాబును బావిలో తోసివేసి చంపేశాడని తెలిపారు. 2019 డిసెంబర్లో కళ్యాణ బాబును చంపానని హంతకుడు మహమ్మద్ సల్మాన్ పోలీస్ విచారణలో తెలిపారు అన్నారు. మృతుడు కళ్యాణ్ బాబుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని శవముగా భావించి కేసు నంబర్ 371/2019 యు/ఎస్ 174 సిఆర్ పిసి ప్రకారం కేసు నమోదు చేశామని వివరించారు. 2021 ఏప్రిల్ నెలలో నేపాల్ కు చెందిన సురేష్ గంజాయి సరఫరా చేస్తానని హంతకుడు మహమ్మద్ సల్మాన్ కు మాట ఇచ్చాడన్నారు. గంజాయి సరఫరా చేయనందుకు మద్దుల గడ్డ తండాకు ఇద్దరు కలిసి వచ్చి గంజాయి మద్యం సేవించిన అనంతరం గొడవపడ్డారని స్పష్టం చేశారు. ముందస్తు పథకం ప్రకారం సురేష్ను చంపడానికి ఇనుపరాడును సిద్ధం చేసుకున్నాడని వెల్లడించారు. అంతకుడు మహమ్మద్ సల్మాన్ తాగిన మత్తులో ఉన్న సురేష్ తలపై ఇనుప పైపుతో కొట్టి చంపాడని చెప్పారు. తప్పించుకు తిరుగుతున్న హంతకుడు మహమ్మద్ సల్మాన్ ను వికారాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని వివరించారు. హంతకున్ని పట్టుకున్న ఎస్సై సత్యనారాయణ పిసి అనిల్ కుమార్ పిసి మునిరాజులకు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి క్యాష్ గిఫ్టు అందజేసి అభినందించారు. చట్టాన్ని ఎవరు కూడా తన చేతుల్లోకి తీసుకోరాదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.