సివిల్ సప్లై కార్మికుల రేట్లు పెంచాలి ** సిఐటియు జిల్లా అధ్యక్షుడు లోకేష్ ** కార్మికుల డిమాండ

Published: Saturday August 06, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 05 (ప్రజాపాలన, ప్రతినిధి) : సివిల్ సప్లై హమాలి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని,ఆసిఫాబాద్ సివిల్ సప్లై గోదాం వద్ద హమాలి కార్మికులతో  శుక్రవారం సిఐటియు జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు అల్లూరి లోకేష్, ఓదెలు, సిఐటియు పిలుపుమేరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ సివిల్ సప్లై కార్మికుల రాష్ట్ర జేఏసీ ప్రభుత్వానికి డిమాండ్ నోటీసు ఇవ్వడంతో ఈనెల నేడు 6న చర్చలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధర పెరుగుదలతో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో,100 కిలోల బరువుకు, రూ 30 చెల్లించాలని, జేఏసీ డిమాండ్ చేస్తుందని, రూ 30కి ఒక్క పైసా కూడా తగ్గేది లేదని, అవసరమైతే సమ్మెకు సిద్దమే నని జెఏసి కృత నిశ్చయంతో ఉందని, జనవరి 2022 నుండి అమలు కావాల్సిన కొత్త రేట్లు 8 నెలలు అవుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టింపు పంతాలకు పోకుండా వెంటనే ఒప్పందం చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. రేపు 6 న జరిగే చర్చలు విఫలమైతే సమ్మెకు సిద్ధంగా ఉండాలని సిఐటియు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై హమాలి కార్మికులు సుధాకర్, దివాకర్, శ్రీనివాస్, హేమాజీ, సురేష్, లోనారే, తదితరులు పాల్గొన్నారు.