ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ

Published: Wednesday September 28, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా పాలన.
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారును మంగళవారం నాడు బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ తన జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు .ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ వేడుకలు జరిగాయి.అనంతరం  రేగా  కాంతారావు మాట్లాడుతూ ఎంతో నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి జలగం జగదీష్ పేదవారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటాడని పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కామిరెడ్డి రామ కొండారెడ్డి,NTV రిపోర్టర్ తాళ్లూరి శ్రీహరి బాబు , కొత్తగూడెం కు చెందిన ప్రముఖ ENT Dr.BS Rao గారు...పలువురు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు,..