ఏడిఎంఎస్ వజ్రాస్ ఎలక్ట్రిక్ బైక్ షోరూం ప్రారంభం

Published: Friday November 11, 2022
 మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 10 నవంబర్ ప్రజా పాలన : యువత స్వయం ఉపాధి పొందుతూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న యువతకు ప్రత్యేక అభివందనాలని వికారాబాద్ మున్సపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
కొనియాడారు. గురువారం జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ స్కూల్ ఎదురుగా ఏడిఎంఎస్ వజ్రాస్ ఎలక్ట్రిక్ బైక్ షోరూం వ్యవస్థాపకులు గద్దియ మహేశ్వర్, బసవేశ్వర్, వెంకటేష్,, శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ద్విచక్ర వాహనాల రకాలు, వాటి కండిషన్ వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏడీఎంఎస్ వజ్రాస్ ఎలక్ట్రిక్ బైక్ షోరూం వ్యవస్థాపకులు మాట్లాడుతూ నాన్ రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ వాహనాలను విక్రయింపబడును తెలిపారు. స్కూటీ నుండి లగేజ్ తీసుకెళ్లే వాహనాల వరకు సరసమైన ధరలకు అమ్మబడునని  అన్నారు. వాహనాలు ఆటోలు భవిష్యత్తులో కార్లు ట్రాక్టర్లు తదితర భారీ వాహనాలను కూడా అమ్మబడునని వివరించారు. వాతావరణ కాలుష్య నియంత్రణ ప్రధాన లక్ష్యంగా ఎలక్ట్రిక్ బైక్ లను అమ్మదలుచుకున్నామని స్పష్టం చేశారు. అందరికీ అందుబాటులో ఉండేలా సరసమైన ధరలకు ద్విచక్ర వాహనాలు లభిస్తాయని, పెట్రోల్ అవసరం లేకుండా పర్యావరణహితమైన ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కౌన్సిలర్ చందర్ నాయక్, టిఆర్ఎస్ నాయకులు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.