రాష్ట్ర విభజన హామీలను కేంద్రం అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేయాలి. ఎండి, జ

Published: Saturday November 26, 2022

చౌటుప్పల్ నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి): కేంద్రంలో అధికారులకు వచ్చిన బిజెపి ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని ఈడీ, ఐటి దాడుల పేరుతోటి మరల్చే ప్రయత్నం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రాల విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రం మీద ఈడి పేరుతో ఐటీ పేరుతో దాడులు చేయడం సమంజసం కాదని తెలంగాణలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చర్యలకు బిజెపి పాల్పడుతుందని వారు అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బిజెపి డొల్లతనం బయటపడిందని కక్ష్యతో ఐటీ, ఈడీ దాడులను జరుపుతుందని బిజెపి నాయకుల మాటలు ప్రజల్లో అశాంతిని రేపుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి విధానాలు రాజకీయాల్లో అలజడి సృష్టించి లబ్ధి పొందాలని చూస్తుందని దీనిని ప్రజలు వ్యతిరేకించాలని వారన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్ర గవర్నర్లను కూడా ఉపయోగించుకోవడం దారుణమని వారన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం విభజన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరితోపాటు సమావేశంలో సమావేశ అధ్యక్షులు దండా అరుణ్ కుమార్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.డి పాషా మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్ ,నాయకులు గోష్క, కరుణాకర్, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, ఎర్ర ఉషయ్య, చికూరి ఈదయ్య, ఎండి ఖయ్యూం, బత్తుల విప్లవ్ రమేష్ ,స్వామి, కృష్ణ, గుణముని ఐలయ్య, బొడ్డు అంజిరెడ్డి, గుర్రం నరసింహ, గంజి రామచంద్రం, మల్లేశం, అవ్వారిరామేశ్వరి, అర్షియా, ఎండి రేష్మ, అండాలు, పాల్గొన్నారు