ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి

Published: Tuesday January 31, 2023

*రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు కలిసి వినతి పత్రం అందించిన వడ్డెరలు*

*వడ్డెర ఎస్టి సాధనకై తొలి అడుగు*

తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్
రాష్ట్ర అధ్యక్షులు అండ్ చైర్మన్శివరాత్రి అయిలమల్లు  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డెర ఎస్టీ సాధన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రంగారెడ్డి  జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమానికి  రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దండుగుల వెంకటరమణ... ఆధ్వర్యంలో ఉండరా ఎస్టీ సాధన హక్కులపై శాంతియుతంగా ర్యాలీ  రిలే నిరాహార దీక్ష జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా మా వడ్డెర్ల స్థితిగతులు మారడం లేదు.ఈ రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర కులాన్ని గుర్తించి మాకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులను అందించాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సమావేశంలో మా వడ్డెర్ల స్థితిగతులపై మాట్లాడి. వడ్డెర కులానికి గుర్తించి మాకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులు మాకు కల్పించక పోతే రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఉద్యమాలు ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము.

                    *మా డిమాండ్లు*

1) .వడ్డెర్లను బీసీ నుండి తొలగించి ఎస్టిలో చేర్చాలి.
2) .వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర ఉపాధ్యక్షులు వరికుప్పల శ్రీశైలం , పల్లపు అశోక్  రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముద్దంగుల చెన్నయ్య, రాష్ట్ర కోశాధికారి పల్లపు నారాయణ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి భవాని  జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు మక్కల సంతోష్ జిల్లా కార్యదర్శి మంజుల నాగేష్ జిల్లా సలహాదారుడు డేరంగుల నర్సింహ్మ ఎం అంజయ్య చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు షాబాద్ మండల అధ్యక్షుడు గోగుల ఆంజనేయులు బాలపుర్ మండల అధ్యక్షుడు గండికోట యాదయ్య అబ్దుల్లాపూర్మెట్ మండల అధ్యక్షుడు  ఇరగదీన్ల సురేష్, తలకొండపల్లి మండల అధ్యక్షుడు బోదాస్ నరసింహ్మ, మహేశ్వరం మండలం అధ్యక్షుడు సంపంగి రాజు,యాచారం మండల అధ్యక్షుడు గండికోట వెంకటేష్ ఈ కార్యక్రమంలో పెద్దలు యువకులు పాల్గొన్నారు.