కుట్టుమిషన్లు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.. డైరెక్టర్ రాధాకృష్ణకు అభినందనలు..

Published: Tuesday February 21, 2023
ఖమ్మం, ఫిబ్రవరి 20 (ప్రజా పాలన న్యూస్):
జనశిక్షణ సంస్థాన్ ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో ఖమ్మం లోని 26వ డివిజన్ నందు స్వయం ఉపాధి శిక్షణ లో భాగంగా మహిళలకు ఉచితంగా 
టైలరింగ్, ఎంబ్రాయిడరర్ లో  శిక్షణ పూర్తి చేసిన 40 మందికి ఖమ్మం మేయర్ శ్రీమతి పునకొల్లు నీరజ గారి సహకారం తో  మిత్రా ఫౌండేషన్ వారి ఆర్ధిక సహకారంతో 40 కుట్టు మిషన్స్ సమకూర్చి జనశిక్షణ సంస్థాన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర రవాణాశాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా కుట్టు మిషన్స్,సర్టిఫికెట్స్ అందించటం జరిగినది అని డైరెక్టర్ వై రాధా కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ జనశిక్షణ సంస్థాన్ వారు ఖమ్మం జిల్లా లోని మారుమూల గ్రామాలలో అందిస్తున్న స్వయం ఉపాధి శిక్షణలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అని డైరెక్టర్ కు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనశిక్షన్ వారికి అభినందనలు తెలుపుతూ డైరెక్టర్ రాధాకృష్ణ కు మంత్రి షాల్వతో సత్కరించారు. మరియు మహిళలందరు స్వయం శక్తి తో  అన్ని రంగాలలో రానించాలని, ఈ మిషన్స్ తీసుకోని నూతన డిజైన్స్ తో  కుట్టి కుటుంబ ఆర్థిక పరిస్థితులనుండి మెరుగు అవ్వాలని ఆశించారు.ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు తో పాటు, కూరాకుల నాగభూషణం డీసీసీబీ చైర్మన్, బచ్చు విజయకుమార్ సుడా  చైర్మన్, పునకొల్లు నీరజ ఖమ్మం నగర మేయర్, పగడాల నాగరాజు తెరాస ఖమ్మం జిల్లా అధ్యక్షులు, పాతిమ ఉప మేయర్ ఖమ్మం, వివిధ డివిజన్ కార్పొరేటర్స్ రోస్లీనా, లక్ష్మి, కృష్ణ,వెంకటరమణ, మాక్బుల్, నాగేశ్వరావు, వసంత, షకినా ఖమ్మం నగర్ తెరాస ప్రచార కార్యకర్త,రజియా సమాజ సేవకురాలు , మిత్ర ఫౌండేషన్ అధినేతలు మరియు జె యస్ యస్ స్టాఫ్, రిసోర్స్ పర్సన్ శాంతి, కవిత జాస్మిన్ చాందిని, లబ్ధిదారులు అనేకమంది అధికారులు, అనధికారులు, ప్రముఖ డివిజన్ ప్రజలు పాల్గొని జె యస్ యస్  అందిస్తున్న కార్యక్రమాలను అభినందించారు.