ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చెర్ల మురళి కి సన్మానం ** డిటిఓ శ్యాం నాయక్

Published: Friday November 25, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 24 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఆసిఫాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చెర్ల మురళీధర్ ను గురువారం ఆయన నివాసంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టిఎస్టి ఓ ఆదిలాబాద్ డిటిఓ, శ్యామ్ నాయక్ చెర్ల మురళిని, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా  నియమించినందుకు అభినందనలు తెలిపి, సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల ఉపాధ్యక్షుడు బొడ్డ రాజేష్, ప్రధాన కార్యదర్శి నెల్లి రవి, కార్యదర్శి నెల్లి నరేష్, శ్యామ్ నాయక్ అభిమానులు షఫీ, వంశీ, మల్లికార్జున్, వడ్లూరి సురేష్, తదితరులు పాల్గొన్నారు.