వల్లూరి పౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంటల్ క్రై మేట్ అవార్డ్ అందజేశారు

Published: Monday June 20, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 19 ప్రజాపాలన ప్రతినిధి.ప్రపంచ పర్యావరణ పరిరక్షణ అంశంపై  ఆదివారం మధ్యాహ్నం,హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతిలో వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  అనేక రంగాలలో నిష్ణాతులైన ప్రతిభావంతులను గుర్తించి  గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ అవార్డు-2022 ను(ప్రపంచ పర్యావరణ పరిరక్షణ పురస్కారం) ప్రదానం చేస్తునట్లు ఆ సంస్థ చైర్మన్ వి.ఆర్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాహిత్య రంగానికి చెందిన రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం,నానక్ నగర్ గ్రామనివాసి, జడ్పీఎచ్చెస్ మేడిపల్లి నక్కర్త పాఠశాలకు చెందిన తెలుగు భాషోపాధ్యాయులు, జోగు కృష్ణయ్య  పర్యావరణ పరిరక్షణ కోసం  తనదైన శైలిలో కవితలు,గేయాలు  రాస్తూ సమాజానికి సేవలు అందిస్తున్నందుకుగాను సగౌరవంగా అభినందిస్తూ,శాలువా మెమెంటోతో సత్కరిస్తూ పర్యావరణ పరిరక్షణ పురస్కారాన్ని  మాజీ న్యాయమూర్తి  మధుసూదన్ , సరస్వతి ఉపాసకులు .దైవజ్ఞ శర్మ , చిత్ర నిర్మాత డా.చౌదరి, మంజూల,  మరియు వి.ఆర్ శ్రీనివాస్  చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖులు: ఆర్టిస్ట్ బ్రహ్మయ్య,పద్మిని,హీరో కిరణ్, శ్రీనివాస్ తదితరుల పాల్గొన్నారు.
ఈసందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు మరియు భాషాభిమానులు పంతులును ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు. పురస్కార గ్రహీత  శ్రీ.జోగు కృష్ణయ్య ఆనందం వ్యక్తం చేస్తూ,ఈ అవార్డుతో ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నా కలానికి,గళానికి మరింత బాధ్యత పెరిగిందని విలేకరులకు తెలిపారు.తమ ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయికి తెచ్చిన ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.