అంగన్వాడి సెంటర్ లో అన్నప్రాసన

Published: Friday November 18, 2022

మధిర నవంబర్ 17 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి 7వ వార్డులో ఉన్న అంగన్వాడి కేంద్రంలో గురువారం చిన్నారులకు అన్నప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్ పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న పోషకాహారం గురించి అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వ అందిస్తున్న పౌష్టికాహారాన్ని చిన్నారులు బాలింతలు గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.