చిన్నారిపై వీధి కుక్కల దాడి

Published: Tuesday March 14, 2023
జిలుగుమాడు కుక్కల స్వైర విహారం
మధిర మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీపరిధిలో సోమవారం నాడు ఉదయం జిలుగుమాడులో ఇంటి ముందు ఆడుకుంటున్న 5 సం: చిన్నారి దోర్నాల వివేక్ పై బజార్లో  గుంపులుగా తిరుగుతున్న కుక్కలు వెంటపడి వివేక్ పై దాడి చేసి చేతి పై గాయపరిచాయి. ఈలోగా తన తండ్రి దోర్నాల  రాము కుక్కలను తరిమి తన కుమారుడిని వాటి ప్రాణాపాయస్థితి నుంచి  రక్షించుకున్నాడు. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి ఆవేదన  వ్యక్తం చేస్తూ   జిగుమాడు గ్రామంలోఅనేకసంఖ్యలోవీధికుక్కలుతిరుగుతున్నాయని, బయటికి రావాలంటే భయభ్రాంతులకుగురవుతున్నారని,వెంటబడి తరిమి కరుస్తున్నాయని. ఇటీవల రాష్ట్రంలో  కుక్కల దాడిలో మరణించిన చిన్నారులనుగుర్తుంచుకోనైనా,
ఇకనైనా సంబంధించిన అధికారులు వీధి కుక్కల బెడదను తగ్గించాలని కోరుతున్నామని అని తెలిపారు.