మహర్షి వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

Published: Monday October 10, 2022
రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్
వికారాబాద్ బ్యూరో 9 అక్టోబర్ ప్రజా పాలన : మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని బి. సి. కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు.. మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి అశోక్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా 
మహాకవి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ,  మహాకవి వాల్మీకి మానవ జీవన విధానానికి  అతి ముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని రచించారని, రామాయణ గ్రంథం ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని తెలిపారు.  హిందూ ధర్మ శాస్త్రంలో చాలా ప్రాచీనమైన రామాయణ గ్రంథం రచించిన మహాకవి వాల్మీకి అని, ఆయన జీవితం సైతం మనందరికీ ఆదర్శ ప్రాయం అని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.  అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని  అయన  అన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి అశోక్ కుమార్ మాట్లాడుతూ, రామాయనాన్ని మధుర కావ్యంగా మలిచి మానవ జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహనీయుడు అదికవి వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.  అయన చూపించిన సన్మార్గంలో  అందరు నడిచి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నారు.  వాల్మీకి జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించుకోవడం జరుగిందన్నారు. ఈ కార్యక్రమంలో మన్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, ఎంపీపీ చంద్రకళ,  జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఉపేందర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, బీసీ సంఘం సభ్యులు అశోక్, అంజయ్య, నాగేష్, పాండు, ఉత్సవాల కమిటీ అధ్యక్షులు రాజలింగం తదితరులు పాల్గొన్నారు.