కెసిఆర్ ప్రభుత్వంరైతులను ఆదుకునే పద్ధతి ఇదేనా తెలుగుదేశం పార్టీ మధిర జనవరి 29 ప్రజాపాలన

Published: Monday January 30, 2023

 ప్రతినిధి మున్సిపల్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో  డాక్టర్ వాసిరెడ్డి రామనాథ మాట్లాడుతూ పేరుకు గొప్ప చేసేది శూన్యం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని అన్నారు.24 గంటలు కరెంటు ఇస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్న ప్రభుత్వం కనీసం 10 గంటలు కరెంటు ఇవ్వటం లేదని ఆ ఇచ్చే కరెంటు లో కూడా గంటకొకసారి కటింగ్ చేసి ఇస్తున్నారని రాత్రులు రెండు మూడు గంటలకి త్రీఫేస్ ఇస్తున్నారని అందువల్ల రైతులు ఇబ్బందులు పడటమే కాకుండా పంటలు ఎండిపోతున్నాయి యని అన్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని ఏ సి డి పేరుతో వినియోగదారి నుండి నిలువుద్యోపిడి చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలోని డ్యాములన్ని నిండుకుండలా ఉన్న సాగర్ జలాలు వారబంది పద్ధతి వలన చివరి భూములకు నీళ్లు అందక పంటలు ఎండిపోయి రైతుల నష్టపోతున్నారు అని చివరి భూములకు నీళ్లు అందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.రైతులకు రుణమాఫీ వెంటనే అమలు పరచాలని, మిర్చి పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లాది హనుమంతరావు శివాజీ నాగేశ్వరావు పుల్లారావు వెంకటేశ్వర కోటి వార్డ్ కౌన్సిలర్ పాల్గొన్నారు