సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమైనవి

Published: Wednesday December 14, 2022
జన్నారం, నవంబర్ 13, ప్రజాపాలన: సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమైనదని, బీసీ సంఘాల నాయకులు మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పి ఆర్ టి యు భవన్ లో వివిధ గ్రామాల బీసీ నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించుట బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేయుట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని సమావేశపరచి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సభకు పంపించాలన్నారు. భవిష్యత్తులో కేంద్రం ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో బీసీ కులాల వారిగా జన గణన చేపట్టాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని సమావేశపరచి తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని బీసీ నాయకులు తీర్మానం చేసినారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం మాదిరిగా బీసీ కులాల వారికి బీసీ బందు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి పది లక్షలు అందజేయాలని డిమాండ్ చేశారు.అనంతరం మండల కేంద్రానికి చెందిన విలేకరులను వారి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని తాము చేస్తున్న డిమాండ్లను విలేకరులు వార్తల రూపంలో సమాజానికి తెలుపుతూరన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరి చంద్రయ్య, కేఏ నరసింహులు, కాసెట్టి లక్ష్మణ్, చెట్పల్లి గంగయ్య, ఆడెపు లక్ష్మినారాయణ, బాలిన మధు, శ్రీరాముల గంగాధర్, శ్రీపాదా రమేష్ బట్టల లచ్చ గౌడ్, కొంతం శంకరయ్య, మామిడి విజయ్, పిల్లి మల్లయ్య, కోడిజుట్టూ రాజన్న,  రమణ, దర్జీ వెంకటేష్, కడాల నరసయ్య, కస్తులపురి నాగేందర్, వేయిగండ్ల రవి, మూల భాస్కర్ గౌడ్, శేఖర్ గౌడ్, వంగపల్లి సురేష్, దండ వేణి చంద్రమౌళి, దండవేణి శ్రీధర్, సింగసాని సంతోష్, అశోక్, ముదేళ్ల శంకర్, దాగదాగే భీమరాజు, రాజేశం ఐలవేణి నర్సయ్య, బొంతల మల్లేష్ యాదవ్, గండికోట కృష్ణ, బాలచందర్ ముమ్మాటి, అల్లం వెంకట్రాజ్యం, ఆకుల నరేష్,  గుడ్ల రాజన్న, శాకాపురం రవి, రాజేందర్