ఘనంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవం

Published: Monday March 22, 2021
మధిర మార్చి ప్రజాపాలన ప్రతినిధి 21 : మధిర పట్టణంలో చెట్ల ఆవశ్యకతను వివరిస్తూ ర్యాలీ నిర్వహించిన ఫారెస్ట్ సిబ్బంది. అడవుల పరిరక్షణ ఆవశ్యకత అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో, జనంలో చైతన్యం రావాలని మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మానవుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మరియు పర్యావరణ అభివృద్దికి అడవులు ఎంతో అవసరమని తెల్పడం ప్రపంచ అటవీ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యంమని ఫారెస్ట్ సిబ్బంది అవగాహన కల్పిస్తూ.. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో మధిర  పట్టణంలో  ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సీతారామారావు, సెక్షన్ అధికారులు కొండా రెడ్డి, సురేష్ మరియు బీట్ అధికారులు పాల్గొన్నారు.