ప్రభుత్వ ఆసుపత్రిలో ముమ్మరంగా సుఖ ప్రసవాలు

Published: Friday December 09, 2022

మధిర రూరల్ డిసెంబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి) మండల పరిధిలోని దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముమ్మరంగా సాధారణ కానుకలు కొనసాగుతున్నాయి. ఈ వారంలోనే దెందుకూరు ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో నాలుగు సాధారణ ప్రసవాలు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్  ఆదేశాలు మేరకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల సూచనలతో దెందుకూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల సుఖ ప్రసవాలు ముమ్మరంగా చేస్తున్నారు. దెందుకూరు వైద్యులు శశిధర్ బస్తి దావాఖాన మధిర 2 వైద్యురాలు సునీత  స్టాఫ్ నర్స్ లు అనూష, రజిని, సృజన సంయుక్త ఆధ్వర్యంలో ఈ వారంలో నాలుగు సుఖ ప్రసవాలు జరిగాయి. వాటిలో మధిర వన్ సబ్  సెంటర్ ఏరియాలోని లడక్ బజార్లో ఒకటి, యాదవ్ బజార్లో ఒకటి, మడుపల్లి సబ్ సెంటర్లో ఒకటి దెందుకూరు సబ్ సెంటరులో ఒకటి చొప్పున మొత్తం నాలుగు సాధారణ కాన్పులు చేశారు. పారా మెడికల్ సిబ్బంది నిరంతరం గ్రామ గ్రామాన తీరగుతూ గర్భిణీలలో అవగాహన కల్పిస్తూ సుఖ ప్రసవాలును ప్రోత్సాహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయటం వల్ల జరిగే ఉపయోగాలు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యధికంగా సాధారణ సుఖ ప్రసవాలు చేస్తున్న వైద్య సిబ్బందిని, పారా మెడికల్ సిబ్బందిని మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజా ప్రతినిధులు మండల అధికారులు  అభినందించారు.