మొక్కను నాటి భూమాత కోతను నివారిద్దాం

Published: Friday October 08, 2021
మర్పల్లి మండల ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్
వికారాబాద్ బ్యూరో 07 అక్టోబర్ ప్రజాపాలన : మొక్కలు నాటి భూమాత కోతను నివారిద్దాం అని మర్పల్లి మండల ఎంపిడిఓ వెంకట్ రామ్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం బంట్వారం రోడ్డు నుండి మర్పల్లి సరిహద్దు వరకు మొక్కలు నాటేందుకు గుంతలు తీయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1250 మొక్కలను గ్రామ సర్పంచ్ రాజమండ్రి నుండి తెప్పించారని పేర్కొన్నారు. శుక్రవారం నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. 3360 మొక్కలు నాటవలసిన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వివరించారు. ప్రధాన రోడ్డు మార్గానికి ఇరువైపులా శుభ్రం చేయించి మొక్కలు నాటుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ సోమలింగం, ఏపిఓ అంజిరెడ్డి, ఈసి విఠల్ రావు, కార్యదర్శి లక్ష్మీకాంతరావు, సాంకేతిక సహాయకులు విష్ణువర్ధన్, పురుషోత్తం, అశోక్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు నాగయ్య రాములు అశోక్ సర్పంచ్ మహ్మద్ బి ఎక్స్ కో ఆప్షన్ మెంబర్ కరీముద్దీన్ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.