ప్రధాని నరేంద్ర మోడీ మాటలు వక్రీకరించారు

Published: Friday February 11, 2022

బీజేపీ యువ నాయకులు బీపీ నాయక్

బోనకల్, ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి: ఇటీవల రాజ్యసభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రం రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్యవాదం పట్ల భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉందని చెప్పే క్రమంలో గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కనీస ప్రమాణాలు పాటించకుండా ఇరు రాష్ట్రాల అగ్గి రాజేసేలా కొన్ని సమస్యలను జటిలం చేసిందని, రెండు రాష్ట్రాలు ఇవ్వడానికి రెండు వేల మంది విద్యార్థుల బలిదానాలు కోరిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలను టిఆర్ఎస్ పార్టీ తమ భుజాల పైన వేసుకొని వాస్తవ విషయాలను పక్కన పెట్టి మోడీ గారి వ్యాఖ్యలను వక్రీకరించి, అవాస్తవాలు చెప్పి విషం కక్కడం అత్యంత దారుణమైన చర్యగా బిజెపి యువనేత బీపీ నాయక్ చెప్పారు. మోడీ దిష్టిబొమ్మల దహనం పైన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు హిందీ రాకపోతే హిందీ వచ్చిన వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవాలి తప్ప ఇలాంటి నీచ సంస్కృతిని అలవాటు చేయొద్దని ఎద్దేవా చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఓర్వలేక, టిఆర్ఎస్ పార్టీ రోజురోజుకీ పతనం అవుతున్న సమయంలో ఇలాంటి చౌకబారు కార్యక్రమాలతో దళిత బంధు సంగతి, రాజ్యాంగాన్ని అగౌరపరిచేలా విధానాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని చెప్పారు.