రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

Published: Thursday October 28, 2021
బోనకల్, అక్టోబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి: కేంద్రం ప్రవేశపెట్టిన రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, కరోనా  బారిన పడి చనిపోయిన వారికి తగిన న్యాయం చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రావినూతల సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు మండల కమిటీ సభ్యులుగుగులోతు నరేష్,గుగులోతు. పంతులు, ఉల్లి నరేష్, సిపిఎం నాయకులు గండు సైదులు, దొండపాటి సత్యనారాయణ, యర్రగా నాగరాజు, కొంగర భూషయ్య, మందా వీరభద్రం, యర్రగాని, నాగేశ్వరరావు జోయిన బోయిన గురవయ్య, పఠాన్ అఫ్జల్, అజ్మీరా.గోపి భానోత్ నాగేశ్వరరావు,, వట్టికుంట రమేష్, మరుదు. వెంకటేశ్వర్లు, మరీదు.వెంకన్న, బోయినపల్లి నాగ తదితరులు పాల్గొన్నారు.