జగిత్యాల జిల్లా కేంద్రంలో లాక్డౌన్ ను పరిశీలించిన ఐజీపి ప్రమోద్ కుమార్

Published: Tuesday May 25, 2021
జగిత్యాల, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లాలో లాక్డౌన్ అమలు తీరును ఐజిపి శ్రీ ప్రమోద్ కుమార్ పరిశీలించారు. లాక్డౌన్ నిబంధనాలు ఉల్లంఘించిన వారిపై 4231 కేసులు మాస్కలు ధరించని వారిపై 3965 కేసులు నమోదు చేశామని తెలిపారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 919 వాహనాలు సీజ్ చేశామని అన్నారు. సోమవారం రోజున జేఎన్టీయూ చెక్ పోస్ట్ జగిత్యాల కొత్త బస్టాండ్ తహసిల్ చౌరస్తా టవర్ సర్కిల్ మంచినీళ్ల బావి ప్రాంతాల్లో లాక్డౌన్ ను కరీంనగర్ రేంజ్ ఐజీపి శ్రీ ప్రమోద్ కుమార్ పర్యవేక్షించారు. లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ కరోన రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఐజి వెంట జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ డిఎస్పి వెంకటరమణ ఏఆర్ డీఎస్పీ ప్రతాప్ ఎస్భి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ టౌన్ సిఐ జయేశ్ రెడ్డి ఉన్నారు.