శంకరపట్నంలో బీజేపీ సంబురాలు

Published: Friday December 09, 2022

శంకరపట్నం డిసెంబర్ 08 ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు చల్లా ఐలయ్య ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో అఖండ విజయం  సాధించినందుకు, ప్రతికూల పరిస్థితులలో కూడా హిమాచల్ ప్రదేశ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకుగాను ఈరోజు శంకరపట్నం మండలం కేంద్రంలో సంబరాలు జరుపుకున్నట్టు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు జంగ జైపాల్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కేశపట్నం కేశపట్నం ఎంపీటీసీ2 ఏనుగుల అనిల్ బిజెపి మండల ఉపాధ్యక్షుడు మంద శ్రీనివాస్ బీజేవైఎం సాయి తదితరులు పాల్గొన్నారు.