ఘనంగా పోషకాహార వారోత్సవాలు ముఖ్యఅతిథిగా పాల్గొన్న... బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ

Published: Thursday September 22, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ....లక్ష్మీపురం గ్రామపంచాయతీలోని అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పోషకాహార వారోత్సవాలు ఐసిడిఎస్ ప్రాజెక్టులో భాగంగా ఘనంగా సీమంతాల నిర్వహణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత బుధవారం నాడు పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అన్ని పోషకాలు ఉన్న ఆహారాన్ని తినాలని పోషకాలు అందుతాయని సంపూర్ణ ఆరోగ్యం తద్వారా బిడ్డకు అన్ని పోషకాలు అందుతాయిని సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డ పుడతారని ఆమె తెలిపారు. విధిగా వైద్యులు సూచించిన ఆహార పదార్థాలను తీసుకోవాలని అన్నారు, గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండి ప్రభుత్వ అందిస్తున్న పౌష్టిక ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తప్పనిసరిగా ప్రతిరోజు తీసుకోవాలని ఏ ఒక్కరోజు కూడా పౌష్టికాహారం  తీసుకోవడంలో ఎటువంటి అశ్రద్ధ వహించకూడదని గర్భిణీ స్త్రీలు అందరికీ సూచించారు అలాగే, అంగన్వాడి కార్యకర్తలకు సూచిస్తూ మీరు గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు అందరూ పౌష్టికాహారం అదేవిధంగా సకాలంలో సరైన వైద్య సేవలు చేసుకునే విధంగా వరివేక్షించాలని వారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగమణి, సిడిపిఓ ప్రమీల, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.