వార్డు సమస్యల పరిష్కార లక్ష్యమే ఉషోదయం

Published: Monday December 19, 2022
15వ వార్డు కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి
వికారాబాద్ బ్యూరో 18 డిసెంబర్ ప్రజా పాలన : వార్డులోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొనుటకు ఉషోదయం కార్యక్రమమని చిట్యాల అనంతరెడ్డి అన్నారు. వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని 15వ వార్డులో ప్రతి ఆదివారం నిర్వహించే ఉషోదయం కార్యక్రమంలో భాగంగా ఉదయం 6 గంటల నుండి 10.30 గంటల వరకు గల్లీ గల్లి తిరిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ 15వ వార్డు పరిధిలోని సాకేత్ నగర్, కమలా నగర్, సాయిబాబా నగర్ ప్రాంతాలలోని ఇంటింటికి వెళ్లి అపరిస్కృతం సమస్యల గురించి ఆరా తీశానని తెలిపారు. కమలానగర్, సాకేత్ నగర్ కాలనీలలోని ప్రజలు బిటి రోడ్లు సిసి రోడ్ల గురించి అడిగారని వివరించారు. కమలానగర్, సాకేత్ నగర్, సాయిబాబా కాలనీలలో మెటల్ రోడ్లు వేయించామని గుర్తు చేశారు. బీటీ రోడ్లు సిసి రోడ్ల గురించి కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది, డ్రైవర్లు చెత్త సేకరణ చేస్తున్నారా అని వార్డు ప్రజలను ప్రశ్నించారు. పరిశుభ్రతలో నిబద్ధతతో పనిచేసి కాలనీ వాసులకు సహకరించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. విద్యుత్ వైర్లకు చెట్టు కొమ్మలు తాకుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారని అన్నారు. వెంటనే స్పందించిన కౌన్సిలర్ లైన్మెన్ శంకర్ కు సమాచారమిచ్చి చెట్టు కొమ్మలను కత్తిరించాలని స్పష్టం చేశారు. సాయిబాబా నగర్ కాలనీలో మాన్యువల్ కవర్స్ ఇంటి నుంచి తెప్పించి వేయించానని వివరించారు. వర్షాకాలంలో ఎక్కువగా జామవుతున్న వర్షపు నీటిని పంపేందుకు అదనంగా మరోవైపు వేయాలని మహిళలు కోరారు. సాకేత్ నగర్ శ్రీనివాస నగర్ పార్కులను శుభ్రం చేయించాలని కౌన్సిలర్ కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన కౌన్సిలర్ వెంటనే మున్సిపల్ సిబ్బందికి పార్కులను శుభ్రం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఉదయ్ కుమార్, నాగయ్య, టీచర్ పిచ్చయ్య, విట్టల్ రెడ్డి, జీవన్ కుమార్, పోలీస్ గోపాల్, బందయ్య, టీచర్ రాములు, రవి వర్మ , చంద్రమౌళి , కృష్ణ , నాగభూషణం,
సతీష్ కుమార్ మున్సిపల్‌ శానిటేషన్ డ్రైవర్లు, సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.