అబ్దుల్లాపూర్మెట్ మండల లో తుర్కయంజాల్ అంగన్వాడి పోషన్ మాసం

Published: Thursday September 02, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి విద్య సంస్థలు,  అంగన్ వాడి కేంద్రాలు పున ప్రారంభం అయినందున తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో గల 21వ వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ని చిన్న పిల్లలకు గుడ్లు, పండ్లు, ఆహారాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కౌన్సిలర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు  కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్. ఈ సందర్భంగా కొత్త కర్మమంగమ్మ మాట్లాడుతూపోషకాహార లోపం వల్ల చిన్నారులు ఎదగకపోవడం, తక్కువ బరువుతో శిశువులు జన్మించడం ముఖ్యంగా బాలికల్లో రక్తహీనత లోపించడం, బాలింతలు, గర్భిణీలు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. సకాలంలో చికిత్స అందించి పోషన్ మాసంలో భాగంగా ఏర్పాటుచేసిన పౌష్టికాహారాన్ని అందించడమే మోషన్ మాసం లక్ష్యమని తెలిపారు. ఈ యొక్క అవకాశాన్ని విధిగా వినియోగించుకోవాలని కొత్త కుర్మ మంగమ్మ తెలిపారు.