అగ్రి పాలిటెక్నిక్ విద్యార్థుల క్షేత్ర సందర్శన

Published: Wednesday November 02, 2022
మధిర రూరల్ నవంబర్ 1(ప్రజా పాలన ప్రతినిధి)
మధిర వ్యవసాయ పరిశోధన స్థానంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా కోర్స్ చదువుతున్న విద్యార్థులు మంగళవారం క్షేత్ర సందర్శన చేశారు. వ్యవసాయ యాజమాన్య భాగస్వామ్య అధ్యయనంలో భాగంగా మండల పరిధిలోని మాటూరు, మాటూరు పేట గ్రామంలో రైతులు పండిస్తున్న వరి, ప్రతి, మిరప తదితర పంటలను పరిశీలించి రైతుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రుక్మిణి దేవి క్షేత్ర స్థాయిలో పంటల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను పంట పొలాల్లో ఏ విధంగా పాటించాలి. దానికి  కావలసిన మెలకువలను తెలియజేశారు. క్షేత్ర సందర్శన చేసిన వారిలో పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ జి వేణుగోపాల్, కె నాగ స్వాతి, ఏవో పరేష్ కుమార్, రైతులు పుల్లయ్య, కృష్ణ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.