జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో వంద శాతం ఫీజు రాయితీ కల్పిచాలి

Published: Thursday August 04, 2022
మంచిర్యాల టౌన్, ఆగష్టు 03, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లాలో వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో పని చేస్తున్న జర్నలిస్ట్ ల పిల్లలకు అన్ని ప్రైవేట్ పాఠశాలలో 100 శాతం ఫీజు రాయితీ కల్పిస్తు జిల్లా విద్య శాఖ అధికారి కార్యాలయం   జారీ చేసిన ఉత్తర్వు లను అన్ని పాఠశాల లలో   అమలు అయ్యేలా చేయలని మంచిర్యాల జిల్లా విద్యాధికారికి డెమొక్రామిటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు   ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా విద్యాధికారి సానుకూలంగా స్పందించి ఫీజు రాయితీ అమలుకు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ మంచిర్యాల జిలా ప్రధాన కార్యదర్శి కొండ ప్రవీణ్, ఉపాధ్యక్షులు కుదురుపాక. పోశం, అధికార ప్రతినిధి కర్రె రాజేశ్వర్, జిల్లా కమిటీ మరియు నాయకులు జాడి. శ్రీనివాస్, పరమాత్ముడు, బండి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు
 
 
 
Attachments area