ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు

Published: Monday September 27, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను మండల రజక సంఘం అధ్యక్షులు ఎలిమినేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా జయంతి సందర్భంగా రజక కుటుంబాలకు రజక బంధు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, 50 సంవత్సరాలు నిండిన రజకులకు ఆసరా పింఛన్, నిరుద్యోగ యువకులకు సబ్సిడీ లోన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేశం, ఉపసర్పంచ్ మై సొల్ల మచ్చగిరి, నాయకులు దంతూరి సత్తయ్య, బోల్ల శ్రీనివాస్, గరిసె రవి, వెలిమినేటి రమేష్, వడ్లకొండ నరసింహ, మైసొల్ల మల్లయ్య, లక్ష్మీ నర్సు, యాదగిరి, ప్రవీణ్, సాయి హరీష్, బొడ్డుపల్లి నరేష్, రమేష్, ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు.