నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేత

Published: Thursday October 28, 2021
బోనకల్, అక్టోబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి గుట్కా ప్యాకెట్లు విక్రయాలపై కట్టడి చేయాలని ఆదేశించటంతో మధిర సి ఐ మురళి నేతృత్వంలో మధిర సర్కిల్ పరిధిలో 10 టిమ్స్ గా పోలీసులు బృందం ఏర్పడి మంగళవారం పాన్ షాపుల్లో చిల్లర దుకాణాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానం ఉన్న షాపుల్లో సిఐ మురళి స్వతహాగా వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనకల్లు మండలం ముష్టి కుంట గ్రామంలో దోస పాటి శ్రీధర్ పై అనుమానం వచ్చి తన ఇంటిలో తనిఖీ చేయగా లక్షా 90 వేల విలువచేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ మురళి పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి, గుట్కా ప్యాకెట్లు అమ్మకాలు చేపడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ మురళీ పేర్కొన్నారు. ఈ తనిఖీలలో బోనకల్ ఎస్ఐ కొండలరావు, ట్రైనీ ఎస్సై సురేష్, ఏఎస్ఐ దొండపాటి వెంకట్ నారాయణ, బోనకల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.