పాఠశాల ముందు విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన

Published: Wednesday December 15, 2021
మంచిర్యాల బ్యూరో‌, డిసెంబర్14, ప్రజాపాలన : కరోనా సమయంలో అన్ లైన్ క్లాసుల పేరుతో పీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ సిసిసి లోని ఆక్సపర్డ్ పాఠశాల ముందు విద్యార్థుల పేరెంట్స్ మంగళవారం ఆందోళన చెపట్టారు. విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన కు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ లైన్ తరగతుల పీజులు రద్దు చేయాలని వారు డిమాండ్.  దీంతో స్థానిక పోలీసులు ఆందోళన విరమింప చేయడానికి ప్రయత్నించగా విద్యాశాఖ అధికారులు రావాలంటూ పట్టుబట్టారు. దీంతో డిఇఒ స్పందించి , ఆందోళన కారులతో మాట్లాడారు. పీజులు విషయంలో యాజమాన్యం తో మాట్లాడి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు డిఇఒ కు పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు అన్లైన్ తరగతులు నడపకూడదని ప్రభుత్వం చెప్పిందని, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఫిజులు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు వసూలు చేసిన పీజులను తిరిగి పేరెంట్స్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదికారులు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు సహాకరించి, విద్యార్థుల తల్లి తండ్రులకు అన్యాయం చేస్తే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. వీలైనంత త్వరలో ప్రైవేటు పాఠశాలల పీజుల జాబితా తయారు చేసి ప్రకటించాలని కోరారు. ఈ ఆందోళనలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.