దండుమైలారం లో శోభాయమానంగా గణేష్ నిమజ్జనోత్సవం-ప్రత్లేక ఆకర్షణగా పూణె బ్యాండ్ -1.15000 పలికిన లడ్

Published: Tuesday September 13, 2022

 దండుమైలారం గ్రామంలోని చారిత్రాత్మక పురాతన శివాలయంలో ప్రతిష్టించిన గణపతి నిమజ్జనోత్సరం నిన్న( 11 - 09-2022 ) రోజున జరిగింది . పూణె ( మహారాష్ట్ర) నుండి వచ్చిన బ్యాండు బృందం నిమజ్జనోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 50 మందితో కూడిన బ్యాండ్ బృందం కాషాయ ధ్వజం తో నృత్యాలు చేస్తూ ముందుకు సాగుతుండగా గ్రామ భజన బృందం భక్తి గీతాలతో ఆధ్యాత్మిక శోభను తెచ్చారు. గ్రామ దేవాలయంలో ప్రతిష్టించిన గణనాధుడు నిమజ్జనానికి భయలుదేరిన సమయంలో ప్రతి ఇంటినుండి మహిళలు మంగళ హారతులు సమర్పించి ప్రసాదాలు స్వీకరించారు. గ్రామ ప్రధాన కూడలిలో నిర్వహించిన లడ్డూ వేలంలో లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు పోటీపడ్డారు గ్రామానికి చెందిన  వెంకటాచారి 115000( ఒక లక్షా పదిహేను వేలు ) రూపాయలకు వేలంలో లడ్డూను పొందగా  ఆలయ ధర్మకర్త రావినూతల వంశీధర్  వేద మంత్రోచ్చరణ మధ్య లడ్డూ ప్రసాదాన్ని అందించి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక కుటుంబ సభ్యులు మరియు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్, గ్రామ సర్పంచ్,  ఎంపీటీసీ మెంబర్లు , వార్డు మెంబర్లు, భజన బృందం సభ్యులు, గ్రామ పెద్దలు ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు , ముఖ్యంగా గ్రామంలోని వివిధ యువజన సంఘాల సభ్యులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు, ఇబ్రాహింపట్నం పోలీసులు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేసి నిమజ్జనోత్సవం విజయవంతంగా జరిగేలా సహకరించారు.