కరోనా నుండి కోలుకున్న 80 సం.లు పైబడిన, మధిర వయో వృద్ధులకు సత్కారం.

Published: Monday October 04, 2021
మధిర, అక్టోబర్ 03, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా బారినపడి, కోలుకున్న, 80 సం.ల పైబడిన, ఆరుగురు వయో వృద్ధులకు, వరిష్ఠ నాగరిక సేవా సంఘం అధ్యక్షుడు, మాథవరపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, వారి, వారి యిండ్ల వద్దకు వెళ్ళి, శాలువాతో సత్కరించి, ఆపిల్ పండ్లు సమర్పించి, పాద నమస్కారాలు చేసి, బాధిత వయో వృద్ధులను, వారి కుటుంబ సభ్యులను, ఆప్యాయత, అనురాగాలతొ, నిన్నటి "ప్రపంచ వయోవృద్ధు ల దినోత్సవం" నేటి గాంధీజీ, శాస్థ్రీజీ జయంతి" పురస్కరించుకుని, పరామర్శించారు. వయో వృద్ధుల సంక్షేమమే తమ సంఘ ధ్యేయమని, బాధిత వయో వృద్ధులు, తమ సమస్యలను, సంఘం దృష్టి కి తెచ్చిన పక్షంలో, చట్టపరంగా, సంభందిత అధికారుల సహకారంతో, సమస్యల పరిష్కారం దిశగా, తాము శ్రమిస్తామని తెలిపారు. వయో వృద్ధుల సంరక్షణ చట్టం, 2007 ద్వారా, వృద్దులసంక్షేమానికై చేపట్టిన అనేక అంశాలను, వివరించారు. అందరూ, ఈ చట్టాలపట్ల పూర్తి అవగాహన కలిగి, సమస్యల పాలు కాకుండా, ఎప్పటికప్పుడు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్, కార్యదర్శి బాబ్ల, కోశాధికారి పబ్బతి రమేష్, సహా కార్యదర్శి ఎండ్రపల్లి పద్మావతి, సభ్యు లు ఎడవల్లి నాగభూషణం, షేక్ సాహెబ్ జాన్, పెద్దలు యిరుకుళ్ల లక్ష్మీ నరసింహరావు, రాధాకృష్ణ మూర్తి, పారుపల్లి వెంకటేశ్వర రావు, కాలం వీరభద్ర రావు, సముద్రాల లక్ష్మీపతి రావు, సన్మానితుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పెద్దలందరూ వచ్చి, తమను పరామర్శించి, సత్కరించటం, తమకెంతో మానసిక బలాన్ని యిచ్చిందని, ఆనందంతో, సేవా సంఘ నిర్వాహకులను, సన్మానితులు అభినందిం చారు.